ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, హాలహర్వి, ఆలూరు రైతులకు నీటి అందించేందుకు హంద్రీనీవా కాల్వకు సత్వరమే తూమును ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తూము ద్వారా సుమారు 50 వేల ఎకరాలు సాగవడంతో పాటు, రైతులకు ఉపాధి, వలసలు తగ్గుతాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆయన పేర్కొన్నారు.