ఆలూరు: ఏఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి: జేఏసీ

ఆలూరు మండల పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై చంద్రశేఖర్ శాంతియుత ఉద్యమాలపై దురుసుగా వ్యవహరించారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. భూపేష్ ఆరోపించారు. గురువారం జేఏసీ నేతలు ఎస్సై మన్మధ విజయ్‌కు ఫిర్యాదు చేశారు. జనవరి 24 బంద్, జనవరి 30 దీక్ష అనుమతుల సమయంలో బెదిరింపులు, దూషణలు జరిగాయని వారు తెలిపారు. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్