ఆలూరు: కల్తీ నెయ్యి కాదు చంద్రబాబు కల్తీ రాజకీయం చేస్తున్నారు

ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, రాష్ట్రంలో ఉండే హిందువులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆలూరు చిప్పగిరిలో శ్రీచెన్నకేశ్వ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తిరుమల లడ్డులో పవిత్రతను కాపాడాలని కోరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు అబద్ధపు మాటలు చెప్పారని, కల్తీ నెయ్యి కాదు, కల్తీ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్