ఆలూరు: మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే క్షమాపణ చెప్పాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, చైర్మన్‌ను కులం పేరుతో, "హిందువు కాదు క్రిస్టియన్" అని తప్పుగా సంబోధించడం అవివేకమని, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన అనర్హుడని పేర్కొన్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసం వెంకన్నస్వామి లడ్డును వాడుకున్నారని, ఇప్పుడు లడ్డు కల్తీపై చర్చ జరగాలని వైసిపి ఎమ్మెల్సీలు పట్టుబడుతుంటే, మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పించుకుంటున్నారని విరుపాక్షి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్