కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మంగళవారం మాజీ, మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు వాడిన టిప్పర్‌కు రూ. 2 లక్షలు, తరువాత మరో లక్ష రూపాయలు నారాయణ అందించారని అదనపు ఎస్పీ హుసేన్ పీరా వెల్లడించారు. నారాయణ ఇంట్లో సీసీఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.