ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధానిపై తమకు వ్యతిరేకత లేదని, అయితే అక్కడ గణనీయమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన పదవీకాలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని, ఏడు సంవత్సరాల పాలనలోనూ అభివృద్ధి ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అమరావతిలో రహదారుల నిర్మాణం జరగలేదని, ఆలూరు అభివృద్ధిపై స్థానిక టీడీపీ నాయకత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, మాటలకే పరిమితమవుతోందని అన్నారు.