ఆలూరు గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో గురువారం టీడీపీ నాయకులు బెంగుళూర్ కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన విద్యార్థులకు విద్యా ప్రాముఖ్యత, మంచి మనసుతో చదువు మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఎటువంటి సమస్యలు వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. గిరిజన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కిషోర్ ను హృదయపూర్వకంగా సన్మానించారు.