ఆలూరు నియోజకవర్గంలో అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి పనులపై టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి బుధవారం వివరించారు. బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లో ఆలూరుకు తీసుకొచ్చిన నిధులను వెల్లడించారు. పెన్షన్‌ను రూ. 3,000 నుంచి రూ. 4,000కు, వికలాంగులకు రూ. 6,000 అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం విస్తృతంగా అమలవుతోందని, సీసీ రోడ్లు, బళ్లారి–కర్నూలు జాతీయ రహదారి మరమ్మతులు, గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు.