కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, టీడీపీ వైకుంఠం జ్యోతి తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని, మహిళలపై బూతులు తిట్టడం, దూషించడం వైసీపీ రాజకీయ సిద్ధాంతంగా మారిందని శుక్రవారం ఆలూరు పోలీస్ స్టేషన్ లో సీఐ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.