ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కర్నూలు జిల్లా ఆలూరులో శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఏపీ మరింతగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఆలయ పరిసరాల్లో భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.