ఆలూరు: ఫోన్ నంబర్ కావాలంటూ బంగారు తాళి లాక్కెళ్లిన దుండగుడు

ఆలూరులో శుక్రవారం ఫోన్ నంబర్ అడిగి మోసం చేసి, మహిళ మెడలోని నాలుగున్నర తులాల బంగారు తాళిని దుండగుడు లాక్కెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఎల్లార్తి రహదారిలో నివాసం ఉంటున్న వెంకటరామప్ప–సరోజమ్మ దంపతుల ఇంటికి కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి, ఇంటి పెద్దాయన ఫోన్ నంబర్ అడిగాడు. పెన్ను, పేపర్ కోసం సరోజమ్మ ఇంట్లోకి వెళ్లగానే, ఆ వ్యక్తి ఆమె మెడలోని తాళిని లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్