ఆలూరు: డీఎస్సీపై అవాస్తవ ప్రచారాలు మానుకోవాలి:

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవ దూరమని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలాది మంది అభ్యర్థులు తమ ప్రతిభ, కష్టంతో ఉద్యోగాలు సాధించారని, వారి విజయాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని, కూలీ, రైతు, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు త్యాగాలు చేసి ఈ విజయాలు అందుకున్నారని తెలిపారు. డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్