ఆస్పరి: ఉపాధి హామీ చట్టం కొనసాగాలంటూ దీక్ష

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, శుక్రవారం ఆస్పరి గాంధీ పార్క్ వద్ద సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వి. బి. జి రాంజీ పథకాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి కృష్ణమూర్తి నిరసన దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉరుకుందప్ప, బ్రహ్మయ్య, కృష్ణ, పడేసాబ్, రంగన్నలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్