మాదిగ నాయకుడిపై దాడి.. దళిత సంఘాల ఆగ్రహం

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంది మడుగుల టి ఏం రమేష్ మాదిగ పై శుక్రవారం సాయంత్రం వాకింగ్ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు టాక్టర్ తో ఢీ కొట్టి, ఇనుప రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి వెనుక ఎవరున్నా సహించేది లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి 24 గంటల్లో రిమాండ్ కు పంపాలని దళిత సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్