హాలహర్వి మండలం బాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బసవేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు వైభవంగా జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయాన్నే స్వామికి జలాభిషేకం, ఆకుపూజ, మహా మంగళ హారతి వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులు మొక్కుబడులు చెల్లిస్తారు. సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రథోత్సవాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.