ఆదోని పట్టణంలోని క్రాంతి నగర్ లో ఆదివారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన వీరుడు వడ్డే ఓబన్న జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న చరిత్రను కాలం మరిచిపోయినా, ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ ఉంటుందని నాయకులు అన్నారు. ఆయన చేసిన కృషి ప్రతిఫలమే నేడు వడ్డే వారు ఆయన చరిత్రను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, బీఎస్పీలో ప్రతి వడ్డే వీరుడికి సముచిత స్థానం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డే వాసులు పాల్గొన్నారు.