ప్రమాద బాధితులను స్వయంగా ఆసుపత్రికి తరలించిన టిడిపి నేత

ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి టిడిపి ఇంచార్జి ఆలూరు వైకుంఠం జ్యోతి సహాయం అందించారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే వాహనాన్ని ఆపి, గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితులను తన వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, బాధితులు ఆమె సేవలను ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్