ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి శనివారం చిప్పగిరిలో విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాశీబుగ్గలో భక్తులు మృతి చెందారని విమర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.