దేవనకొండ: బూత్ స్థాయి బలోపేతమే పార్టీ విజయానికి బలం.. ఎమ్మెల్యే

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సోమవారం దేవనకొండలో నిర్వహించిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ, బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీ విజయానికి వెన్నెముక అని అన్నారు. ప్రతి ఓటరుతో మమేకమై పార్టీ సిద్ధాంతాలు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో విజయం బూత్ స్థాయి నిర్వహణపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్