కర్నూలు-బళ్లారి హైవే ప్రతిపాదనపై కేంద్ర మంత్రితో చర్చ

కర్నూలు జిల్లాలోని కర్నూలు-బళ్లారి హైవే ప్రతిపాదనకు కేంద్ర మద్దతు కోరుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలను అనుసంధానించే ఈ హైవే వాణిజ్యం, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని వారు వివరించారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూల స్పందన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్