ఆస్పరి మండలం అట్టేకల్ గ్రామంలో దస్తగిరయ్య ఉరుసు సందర్భంగా బాణసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పేలి కురువ మల్లికార్జున, కురువ ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నాయకులు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులతో మాట్లాడి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.