ఆలూరు మండలంలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే ఫిర్యాదుతో బుధవారం అమ్మ ప్రైవేట్ ఆసుపత్రిపై వైద్యాధికారులు దాడులు నిర్వహించారు. ఆదోని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సత్యవతి, తహసీల్దార్ శోభ సువర్ణమ్మ సమక్షంలో ఆసుపత్రిని తనిఖీ చేసి స్కానింగ్ గది, స్కానింగ్ మిషన్‌ను సీజ్ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ప్రభుత్వం నిషేధించిన ఈ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ సత్యవతి హెచ్చరించారు. ఆసుపత్రి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.