హాలహర్వి: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ శుక్రవారం హాలహర్వి మండల కేంద్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చిరకాలం నిలుస్తాయని, మహిళలు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్