కర్ణాటకలోని మడికేరి నుంచి గుల్బర్గాకు వెళ్తున్న తుపాన్ వాహనం ఆదివారం హాలహర్వి శివారులో నడుమ వంక వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 9 మందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు చెప్పవచ్చు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారు.