రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల భోజమ్మ, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రైతుల సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ, జగన్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కపట ప్రేమతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అధిక నిధులు ఖర్చు చేస్తోందని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆక్వా, పొగాకు రైతుల విషయంలోనూ జగన్ ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, రైతుల పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని భోజమ్మ పేర్కొన్నారు.