రైతుల సమస్యలు పట్టవా అంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం రెమడూరు గ్రామ పొలాలను సందర్శించారు. కె. నాగలాపురం వరకు ఉన్న రోడ్డు దురవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాలు, మందులు ఎడ్ల బండ్లపై తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో రైతులు ఉన్నారని, సమస్యను జెడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కల్పిస్తామన్నారు.