కర్నూలు: నేడు పదో తరగతి ఫలితాల విడుదల

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. డీఈవో సుధాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, అలాగే మార్చి 16 నుంచి 30 వరకు నిర్వహించిన ఏపీఓఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలు విడుదల అవుతాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లు, వాట్సాప్, ఎల్‌ఈఏపీ విధానం, డిజిలాకర్ యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పూర్తి పేరు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్