మద్యపానం, మత్తు పదార్థాల వ్యసనాల వల్ల అనారోగ్యంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కర్నూలు ఎక్సైజ్ జిల్లా అధికారి ఎం. సుధీర్ బాబు అన్నారు. శనివారం కర్నూలు ధర్మపేటలో వ్యసనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలని, కుటుంబ రక్షణకు భాగస్వాములవ్వాలని సూచించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.