ఎం. కొట్టాల: రెండు గడ్డివాములు అగ్నిప్రమాదంలో దగ్ధం

ఆలూరు మండలంలోని ఎం. కొట్టాల గ్రామంలో మంగళవారం రాత్రి రెండు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్థుడు జయన్న పశువుల కోసం ఏర్పాటు చేసుకున్న వరిగడ్డి, జొన్న వాములకు పక్కనే ఉన్న చెత్త సంపద కేంద్రం నుంచి నిప్పు అంటుకుంది. స్థానికులు సకాలంలో స్పందించి, మరికొన్ని గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్