కడితోటలో పిచ్చికుక్క దాడి.. బాలుడికి గాయాలు

హొళగుంద మండలంలోని కడితోట గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మంజు, శనివారం పిచ్చికుక్క దాడిలో గాయపడ్డాడు. నాన్నమ్మతో కలిసి పని నిమిత్తం హొళగుందకు వెళ్తుండగా పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు బాలుడిని రక్షించి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు బాలుడి తండ్రి శేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్