పట్టపగలు భారీ చోరీ

ఆలూరు పట్టణంలో గురువారం మధ్యాహ్నం ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల ఇంట్లో పట్టపగలే 14 తులాల బంగారం, రూ. 7 వేల నగదును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. బ్రహ్మయ్య దంపతులు భోజనానికి ఇంటికి వెళ్లేసరికి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగి ఉంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్