ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శుక్రవారం చిప్పగిరిలో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శ్రీరామ నవమి వేడుకల్లోనూ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.