దళిత నాయకుడి హత్యపై దళిత జేఏసీ కలెక్టరేట్ ముట్టడి

కర్నూలు జిల్లాలో దళిత నాయకుడు బొండుమడుగుల రమేష్ హత్యను నిరసిస్తూ దళిత జేఏసీ నాయకులు శనివారం ఉదయం 9 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. బొందిమడుగుల గ్రామంలో వాకింగ్ చేస్తుండగా ట్రాక్టర్ తో ఢీకొట్టి, రాడ్లతో దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం చెల్లించాలని, లేదంటే కూటమి పార్టీలకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్