ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్‌లు అందజేశారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడం తమ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆశలు, అవసరాలు గుర్తించి వారికి అండగా నిలబడటమే తమ లక్ష్యమని నాయకులు తెలిపారు.