తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామంలో నిర్వహించారు. టీడీపీ మాజీ ఇన్‌చార్జి బి. వీరభద్రగౌడ్ ఇంటింటికి తిరుగుతూ కుటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజలకు వివరించారు. పార్టీ అందిస్తున్న సేవలు, పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.