పత్తికొండ: భారీగా పడిపోయాయి టమాటా ధరలు

కర్నూలు జిల్లాలోని పత్తికొండలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం కిలో ధర రూ. 5 నుంచి రూ. 10కే పరిమితమవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో రూ. 10–20 వరకు పలికిన ధరలు ప్రస్తుతం పూర్తిగా క్షీణించాయి. రిటైల్‌లో మాత్రం రూ. 15–20కు విక్రయిస్తున్నా రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. అయినా అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్