ఆలూరు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 2 తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆలూరు అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నబి రసూల్, సిపిఐ మండల కార్యదర్శి కె.భూపేష్ సమర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తుంది అని, ప్రతి వ్యవసాయ కూలికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని రోజు 500 రూపాయలు కూలి ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళలపై దళితులపై గిరిజనులు ముస్లింల క్రిస్టియన్లపై దాడులను అరికట్టాలని అన్నారు. స్థానికంగా ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే వేదవతి ప్రాజెక్ట్ నగర డోనా రిజర్వాయర్ ను వెంటనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జే.రాజు, వై.రామాంజనేయులు, చంద్రమ్మ, మారెమ్మ, హొతురప్ప, ఏఐఎస్ఎఫ్ నాయకులు మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.