కర్నూలు జిల్లావ్యాప్తంగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నారు. బుధవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు దగ్గరలోని టీ, పాన్, కిరాణా షాపుల్లో సిగరెట్లు, గుట్కా విక్రయిస్తున్న షాపులపై పోలీసు తనిఖీలు నిర్వహించారు. విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు విక్రయించిన షాపు యజమానులకు చట్టప్రకారం జరిమానాలు విధించారు.