ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొండ్ల పెద్ద హనుమంతు బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సంఘటనా స్థలానికి చేరుకుని, కొండ్ల పెద్ద హనుమంతు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు వీక్రాంత్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.