శుభకార్యానికి డెకరేషన్ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న మీనీ ట్రాలీ వాహనం లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన జింక శ్రీనికేత్, గుజ్జ సాయికృప, గుల్ల సతీష్‌లు బళ్లారిలో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, మండలంలోని చిన్నహోతూరు–ఆస్పరి మధ్యలో మీనీ ట్రాలీ వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుల్ల సతీష్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు.