గురువారం హోళగుంద మండలం సులువాయి గ్రామంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి ఆశయాలను స్మరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమ కర్నూలు జిల్లాలో వాల్మీకి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. కర్ణాటకలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల వారు విద్య, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించారని ఆయన పేర్కొన్నారు.