తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ఆస్పరి మండలం తంగారాడోనా గ్రామంలో నిర్వహించారు. టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ్ పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, పార్టీ పథకాలపై అవగాహన కల్పించారు. మై టీడీపీ యాప్ లో ప్రజా సమస్యలను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.