ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం ఆగదు

ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని ఆదోని–ఆలూరు జేఏసీ నాయకులు అశోకానంద రెడ్డి, కత్తి రామాంజనేయులు, భూపేష్ స్పష్టం చేశారు. బుధవారం ఆలూరులో ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలూరు–బళ్లారి ప్రధాన రహదారిపై వంటవార్పుతో నిరసన తెలిపారు. వైసీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఆదోని ప్రాంత ప్రజల ఆకాంక్షలను పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. ఐదు నియోజకవర్గాలతో ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్