హాలహర్వి మండల పరిధిలోని బాపురం గ్రామంలో శ్రీ ఉద్భవ బసవేశ్వర స్వామి ఆలయంలో మాఘ పూర్ణిమ పర్వదినాన గంగాభిషేకం, పంచామృతాభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. సాయంత్రం పచ్ఛారపల్లి భక్తులు రుద్రాక్ష, గజమాలలతో స్వామి రథోత్సవానికి చేరుకొని, నృత్యాలు, సాంస్కృతిక చెక్క భజనలతో ఊరేగింపుగా బాపురం గ్రామానికి వచ్చి స్వామికి సమర్పించారు. అనంతరం అశేష భక్త జనాల సమక్షంలో ఎదురు బసవన్న గుడి దగ్గర రథోత్సవాన్ని ప్రారంభించారు.