హొళగుందలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

మంగళవారం హొళగుంద సాయిబన్న దర్గాలో ఆశ్రయం పొందుతున్న సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని, ఆరోగ్యం విషమించడంతో దర్గా పూజారులు, గ్రామ యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చి, అంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు హొళగుంద పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్