దేవనకొండ మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, మాజీ వలంటీర్ కటిక నరేష్ (35) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఒక్కసారిగా కేక వేయడంతో కుటుంబసభ్యులు చూడగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నాయకులు, కార్యకర్తలు మృతదేహానికి నివాళులర్పించారు.