బనగానపల్లె వద్ద ఆటో బోల్తా 14 మందికి గాయాలు.. ఒకరి మృతి

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం దద్దనాల చెరువు సమీపంలో మంగళవారం ఆటో బోల్తా పడి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు, ఒక వృద్ధ మహిళ మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్