అన్నమయ్య జిల్లాలో మామిడి కాయల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడి 9మంది మృతి చెందిన ఘటనపై మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం వ్యక్తం చేసారు. సోమవారం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.