కొలిమిగుండ్లలో ఏఆర్ కానిస్టేబుల్‌పై జరిగిన దాడి ఘటనను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు ఎప్పటికీ ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హామీ ఇచ్చారు.