బనగానపల్లె మండలం ఫతేనగర్‌లో సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కూలీలతో కలిసి కరపత్రాలు విడుదల చేసి, ఈ నెల 10-12 మధ్య అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ చట్టం కొనసాగింపు కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.